
ప్రస్తుతం భారతీయుడు-2 సినిమాతో బిజీగా ఉన్నాడు దిగ్గజ నటుడు కమల హసన్. 14 సంవత్సరాల తర్వాత భారతీయుడు సినిమాకు సీక్వెల్ కోసం డైరెక్టర్ శంకర్‌తో జతకట్టాడు కమల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా, 2021 సంవత్సరం మొదట్లో సినిమా రిలీజ్ చేయాలని శంకర్ పట్టుదలగా ఉన్నాడట.
ప్రస్తుతం చెన్నై ఈవీపీ స్టూడియోస్‌లో చిత్రీకరణ కొనసాగుతుండగా… కొన్ని సీన్స్ చైనా సహా ఇతర దేశాల్లో చేయాలని శంకర్ ఫిక్స్ అయ్యాడట. ఆ ముహుర్తం దగ్గరపడుతున్నప్పటికీ… చైనాలో కరోనా వైరస్ కారణంగా చైనాకు వెళ్లాలా వద్దా అన్న మీమాంసలో ఉందట చిత్ర యూనిట్.
అయితే, కమల్ సూచనల మేరకు చైనా నుండి ఆ షూటింగ్ స్పాట్ ఇటలీకి మారిందని తెలుస్తోంది. శంకర్ కూడా కమల్‌కు ఓకే చెప్పటంతో… తరువాతి షెడ్యూల్ ఇటలీలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్‌తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ నటిస్తున్నారు.