సంక్రాంతి పండుగ వస్తుందంటే థియేటర్లలో సందడి చేయడానికి హీరోలు సిద్ధంగా ఉంటారు. అయితే ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో నిలిచేందుకు స్టార్ హీరోలు రెడీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ శృతి హాసన్ జంటగా తెరకెక్కిన చిత్రం క్రాక్. ఈ సినిమా సంక్రాంతికి రాబోతుందని తెలుస్తోంది. ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
మరోవైపు దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కుతున్న అరణ్య చిత్రం కూడా సంక్రాంతికే విడుదల కానుంది. అడవి ని కాపాడే ఆటవిక మనిషిగా ఈ సినిమాలో రానా కనిపించబోతున్నాడు. మరోవైపు అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా సంక్రాంతికే విడుదల కానుందని తెలుస్తోంది. అయితే మొదట ఎనర్జిటిక్ హీరో రామ్ రెడ్ సంక్రాంతి కానుకగా వస్తుందని అనుకున్నారు. కానీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఈ సంక్రాంతి బరిలో పై చెయ్యి ఎవరిదో .