బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతుంది. మరో రెండు మూడు వారాల్లో షో కూడా కంప్లీట్ కానుంది. విజేత ఎవరో కూడా డిసైడ్ కాబోతుంది. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్ లో క్రేజ్ ఉంది. ముఖ్యంగా యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ కు ఆ క్రజ్ కొద్దిగా ఎక్కువనే చెప్పాలి. అయితే తాజా మరోసారి ఆ క్రేజ్ ఎలా ఉంది అన్న దానిపై క్లారిటీ వచ్చింది.
సోషల్ మీడియాలో అన్ స్టాపబుల్ షన్ను ట్యాగ్ తో వన్ మిలియన్ కి పైగా ట్వీట్స్ వచ్చాయి. ఇది ప్రస్తుతం ఇండియన్ వైడ్ ట్రెండ్ లో ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కి మిలియన్ కి పైగా ట్వీట్స్ రావటం గ్రేట్ అనే చెప్పాలి. దీనిని బట్టి షన్ను కి ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో చెప్పొచ్చు.