సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో కొందరికి మంచి ఫాలోయింగ్ వస్తుంది. తమ టాలెంట్ ను బయట పెట్టి ఆదాయం కూడా భారీగానే సంపాదిస్తున్నారు. యువ నటులు ఎందరో బయటకు వస్తున్నారు. యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియో లు అలాగే వెబ్ సీరీస్ లు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇలా పాపులర్ అయిన వారిలో బిగ్ బాస్ శన్ముఖ్ కూడా ఒకరు.
యూట్యూబ్ లో ఫేమస్ అయిన తర్వాత అతను బిగ్ బాస్ కి కూడా వెళ్ళాడు. ఇక దీప్తి అనే అమ్మాయితో అతని ప్రేమ వ్యవహారం ఒక సంచలనం అనే చెప్పాలి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అతని గురించి ఏదోక చర్చ జరుగుతూనే ఉంటుంది. షణ్ముఖ్ జశ్వంత్ ఖరీదైన కారును కొనడం ఇప్పుడు సంచలనం అయింది. ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొన్నాడు.
షణ్ముఖ్ జశ్వంత్ కొనుగోలు చేసిన కారు 51 లక్షలు అని తెలుస్తుంది. బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోప్ మోడల్ ను షణ్ముఖ్ జశ్వంత్ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ గా నిలిచిన ఈ యువ నటుడు ఆహా ఓటీటీ కోసం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. కొందరికి బిగ్ బాస్ నష్టం చేసినా ఇతనికి మాత్రం మంచి ఫేం తీసుకొచ్చింది.