సోషల్ మీడియా సెలబ్రిటీ షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ వీడియోలు, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో మంచి క్రేజ్ పొందారు. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లలో షణ్ముఖ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. గత ఏడాది జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కూడా షణ్ముఖ్ పాల్గొన్నారు. షో రన్నరప్‌గా నిలిచాడు. ఈ షో లో సిరితో షణ్ముఖ్ చేసిన పనులు హాట్ టాపిక్ మారాయి.
దీనితో షో ముగిసిన కొన్ని రోజుల తర్వాత, షణ్ను దీప్తి సునైనాలు విడిపోయాడు. వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. చివరగా, షణ్ను ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి స్పందించాడు.
తన బ్రేకప్‌తో సిరికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అయితే బిగ్ బాస్ ద్వారా తనకు వచ్చిన విపరీతమైన నెగిటివిటీ వచ్చిందని దీప్తి కూడా అన్ని ప్రతికూలతలను ఎదుర్కోవలసి వచ్చిందని అతను చెప్పాడు. దీప్తికి తన కుటుంబం నుంచి బయటి వారి సమస్యలను ఎదుర్కోవడం కష్టంగా మారిందని అన్నాడు.
దాంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. దీప్తి నేను విడిపోవడానికి సిరినే కారణం అని ఆమె నిందించవద్దని కోరాడు. లోపం తన వైపు ఉందని చెప్పుకొచ్చాడు.