ప్రపంచ నంబర్ వన్ మాజీ క్రీడాకారిణి మరియా షరోపోవా జులై 1 మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆడటం మానేసి చాలా ఏళ్లయినా ఆమె పట్ల ఉన్న అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన షరోపోవా మరియా 42 ఏళ్ల బ్రిటిష్ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్క్స్ డిసెంబర్ 2020లో తమ నిశ్చితార్థాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
రెండు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో షరపోవా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. పుట్టిన బాబుకు థియోడర్ అని పేరు పెట్టారు.
మా కుటుంబానికి రివార్డింగ్ గిఫ్ట్ అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలో చిన్నారి చాలా ముద్దుగా ఉన్నాడు. ఈ ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. నెట్టింట్లో ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. నెటిజన్లు షరోపోవాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఆమె 17 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు, ఆమె 2004లో వింబుల్డన్‌లో తన మొదటి మేజర్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె 2006 US ఓపెన్, 2008 ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు 2012, 2014 ఫ్రెంచ్ ఓపెన్ కిరీటాలను కైవసం చేసుకుంది. ఆమె 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కూడా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ చేతిలో ఓడిపోయారు.