ఇటాలియన్ ద్వీపం ఎల్బాలోని పోర్టోఫెర్రాయియోలో ఓ వింత చేప కనిపించింది. తలేమో పందిలా.. కిందిభాగం సొరచేపలా ఉంది. నావికాదళం కంటపడిన ఈ చేపను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు.
పరిశోధకులు దాన్ని నిశితంగా చూసి.. ఆన్గ్యులర్ రఫ్ షార్క్ అని తేల్చారు. సముద్రంలో చాలా లోతులో ఇది జీవిస్తూ ఉంటుందని తెలిపారు. దీన్ని పిగ్ ఫేస్ షార్క్ అని కూడా పిలుస్తారని చెప్పారు.
ఆన్గ్యులర్ రఫ్ షార్క్ లు అంతరించే దశలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ తెలిపింది. అయితే స్థానికులేమో.. ఇది సందర్భోచితంగానే కనిపిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వింత చేప ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.