షర్మిల, వైటీపీ అధ్యక్షురాలు
అయ్యా కేసీఆర్ గారు.. ఢిల్లీ కోటలు బద్దలు కొట్టుడు కాదు. ముందు రాష్ట్రంలో ఆగమైతున్న రైతులను నిలబెట్టు. రోజుకిద్దరుగా ఆత్మహత్య చేసుకుంటున్న రైతులను ఆదుకో. వారిని పట్టించుకో.
మోడీని దేశం నుంచి తరుముడు ఏమో గానీ.. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరమకుండా చూస్కోండి. ఉద్యోగాల కోసం ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. అవన్నీ ప్రభుత్వ హత్యలే.
మీరు పులి బిడ్డయితే మొన్న మీ మెడ మీద లేని కత్తిని చూసి వడ్లు కొననని ఎట్లా రాసిచ్చారు దొరగారు? నిన్నటిదాకా కేంద్రానికి వంతపాడి ఈరోజు ఉడుత ఊపుల పంచాయితీ పెట్టినవా?
రాష్ట్రంలోని సమస్యలనే పరిష్కరించడం చేతకాని దొర.. దేశ రాజకీయాలు చేస్తారా?. ఇదంతా గాలిలో మేడలు.. పగటి కలలు.. ఓట్ల కోసం తిప్పలు.