షర్మిల, వైటీపీ అధ్యక్షురాలు
ఆరేళ్ల పాపపై అత్యాచారం మరువకముందే తాగుబోతుల చేతిలో మరో యువతి బలైపోయింది. దొరగారి పాలనలో గల్లీకో వైన్స్, వీధికో బార్. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారు కేసీఆర్. ఆరేళ్ల పాప నుంచి 60 ఏళ్ల ముసలమ్మ అని కూడా చూడకుండా తాగిన మత్తులో మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే తనకేమీ పట్టనట్టు ఉన్నారు. ఆడపిల్లల మాన ప్రాణాలను ఫణంగా పెట్టి… అటు లిక్కర్ ఆదాయం, ఇటు అఘాయిత్యాలు 300 రెట్లు పెంచారు కేసీఆర్. అయ్యా దొర నువ్వు చేసిన బారుల తెలంగాణ, బీరుల తెలంగాణని చూడు.. మహిళల మాన ప్రాణాలకు దొరుకుతున్న రక్షణని చూడు.
వైఎస్ ఆరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క రోజు కూడా అణాపైసా కరెంట్ బిల్లు పెంచలేదు. పైసా ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. అర్ద రూపాయి ఇంటి పన్నులు కూడా పెరిగింది లేదు. కానీ కేసీఆర్ ఏడేళ్ల పాలనలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఇప్పుడు చార్జీల మోత పెడుతున్నారు. 2016 లో 10శాతం పెంచిన ఆర్టీసీ చార్జీలు.. సమ్మె తరువాత 20శాతం పెంచారు. ఇప్పుడు మరో 30శాతం పెంచేందుకు రెడీ అవుతున్నారు. ఇంటి కరెంట్ బిల్లులు కూడా పెంచేందుకు సిద్దమవుతున్నారు. చాలు దొర మీ పాలన. తల మీద లక్ష రూపాయల అప్పు మోపు చేశావు. అది చాలదన్నట్టు ఇప్పుడు చార్జీల మోత మోపుతున్నావు.