షర్మిల, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు
సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తే 6 రోజులైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖం చెల్లని ఈ ప్రభుత్వ పెద్దలు.. మేము చేసిన దీక్ష వల్ల దిగొచ్చి పరామర్శించారు.
ఇన్నిరోజులు కలవడానికి రాని మంత్రులు.. నిందితుడు చనిపోయిన తరువాత బాధిత కుటుంబాన్ని కలవడానికి పోటీ పడటానికి సిగ్గుండాలి. నిందితుడిని పట్టుకోవడంలో వైఫల్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. రేపిస్ట్ ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వ అసమర్థతను, కేసీఆర్ పాలనలో పోలీసులపై ప్రజలకులేని నమ్మకాన్ని వేలెత్తి చూపిస్తూనే ఉన్నాడు.