వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు ఢిల్లీకి వెళ్లారు. ఆమె కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ కార్యవర్గాలు ఇప్పటికే తెలిపాయి.ఈ నేపథ్యంలో ఆమె సీబీఐ అధికారులను కొద్ది సేపటి క్రితం కలిశారు.
ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతి పై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీని గురించి వెంటనే విచారణ జరిపించాలని ఆమె సీబీఐ అధికారులకు వినతి పత్రం అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతి, మెగా కంపెనీలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసినట్లు ఆమె వివరించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ ఏర్పాటు, లక్ష్యాలు, పలు అంశాలపై మీడియాకు వివరించనున్నట్లు సమాచారం. షర్మిలతో గట్టు రాంచందర్ రావు, పిట్టా రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, తుడి దేవేందర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు.
కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ తమిళి సై ని , ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ ను కలిసి ఇప్పటికే ఫిర్యాదు చేశారు.