వైఎస్ కూతురుగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న వైఎస్ షర్మిలకు ఏమీ కలిసి రావటం లేదు. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేసినా పీపుల్ అటెన్షన్ మాత్రం డైవర్ట్ కావటం లేదు. వైఎస్ పై ఉన్న అభిమానం దృష్ట్యా తనకు కలిసి వస్తుందని ఏర్పాటు చేసిన వైఎస్ ఆత్మీయ సమ్మేళనం కూడా ప్లాప్ అయ్యింది. విజయమ్మ, షర్మిల ఎంత ప్రయత్నిస్తున్నా షర్మిల ప్రయత్నాలు ఫలించటం లేదు.
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సాధించుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్న ఫలించకపోవటంతో… షర్మిల పాదయాత్రకు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. షర్మిల పార్టీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 18 నుండి పాదయాత్ర మొదలుపెట్టే అవకాశం ఉంది. తన తండ్రి సెంటిమెంట్ ను కొనసాగిస్తూ చెవేళ్ల నుండే ఈ పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ లో 100రోజుల పాటు ఈ యాత్ర కొనసాగించాలని, దళితుల సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యలే ప్రధాన అంశంగా ఈ పాదయాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఎలాగైనా తెలంగాణ రాజకీయాల్లో కీలక పార్టీల్లో ఒకటిగా ఉండాలన్న కసితో ఉన్న షర్మిల… ఆ పాదయాత్ర అందుకు పనికొస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ ఎఫర్ట్ కూడా ఫెయిల్ అయితే ఎలా అన్న భయం కూడా షర్మిల అండ్ టీం ను కలవరపెడుతున్నట్లు సమాచారం.