షర్మిల, వైటీపీ అధ్యక్షురాలు
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది రైతుల పరిస్థితి. దొరగారి గలీజు మాటలు, గందరగోళ పాలనతో అరిగోస పడుతున్నారు. నీళ్లు ఉన్నా గాని వరి పండించలేని దుస్థితి. యాసంగిలో వరి వేస్తే ఉరే-వరి కొననన్న కేసీఆర్ గారు, ఏం పంటలు వేయాలో మీరే చెప్తానన్నారు. ఇప్పటివరకు చెప్పింది లేదు.
పూటకో మాట మార్చే దొర ఏం చెప్తాడో తెలియక సందిగ్ధంలో ఉన్నారు. దొడ్డు బియ్యం కాదు సన్నాలు అన్నడు, కొన్నది లేదు. మక్కలు, జొన్నలు అన్నడు, MSP ఇచ్చింది లేదు. ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలంటున్నడు, కొంటడన్న గ్యారంటీ లేదు. మద్దతు ధర ఇస్తడన్న నమ్మకం లేదు. బాతాఖాని సారు. బాతకాని జోరు. రైతులు బేజారు.