వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల వివాహ వ్యవస్థను అవమానించిందని.. ఆమె వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య సీతా మహాలక్ష్మీ మండిపడ్డారు. ఆమె కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని.. వాటికి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఒక ఆడపిల్లగా విజయమ్మ మీకు ఏం నేర్పించిందని విమర్శించారు. అందరికీ భావ వ్యక్తీకరణ హక్కుందని, అలా అని విచక్షణ లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. వాళ్లు కడపలో రాజకీయాలు చేసినట్టుగా మనం చేయకూడదని కార్యకర్తలు చెప్పేందుకే ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదవడం కాదు, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని షర్మిలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు ప్రస్తావించి, వ్యక్తిగతంగా తన మనోభావాలు దెబ్బతీసినందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తానొక ఎమ్మెల్యే భార్యలా రాలేదని, ఓ కుటుంబ మహిళగా, పిల్లలకు తల్లిగా వచ్చానని సీతా మహాలక్ష్మీ అన్నారు.