రైతులకు భరోసా కల్పించడానికి ఈ నెల 19 నుంచి రైతు ఆవేదన యాత్ర మొదలు పెట్టనున్నట్టు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత యాత్ర స్టార్ట్ చేస్తామన్నారు. రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే చేతగానితనంతో తమను అరెస్ట్ చేశారని ఆరోపించారామె.
తమ యాత్రలను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు షర్మిల. 70 రోజుల్లో 200 వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన సీఎం తీర్దయాత్రల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. ప్రతీ బాధిత కుటుంబానికి కనీసం రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు షర్మిల.