షర్మిల, వైటీపీ అధ్యక్షురాలు
నా చావుతోనైనా నిరుద్యోగుల ఆత్మహత్యలు అగిపోవాలని మీకు ఇంకెంతమంది అర్జీ పెట్టుకోవాలి కేసీఆర్ గారు?. ఇంకా ఎందరి కన్నతల్లులు కడుపుకోతను అనుభవిస్తే ఉద్యోగాలు ఇస్తారు.
త్వరలో ఉద్యోగాలు అని ఇంకా ఎన్ని ఏండ్లు జరుపుతారు?. మీ నరంలేని నాలుక ఇంకా ఎన్ని అబద్దాలాడుతుంది? నిరుద్యోగులపై ఎందుకంత వివక్ష.
నోటిఫికేషన్స్ రాక నిరుద్యోగులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఇంత చదువు చదివి కూలిపని చేస్తున్నావు అనే మాటల అవమానాన్ని భరించలేక పోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తల్లిదండ్రులకు భారం కాలేక పురుగుల మందు తాగి తమ్ముడు కురుమూర్తి ఆత్మహత్య చేసుకోవడం ఏ మనిషినైనా కదిలిస్తుంది. కానీ.. కేసీఆర్ ని కాదు. ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలు ఎప్పటికి నింపుతారు సారు.