నిరుద్యోగుల సమస్య పై కలిసి పోరాటం చేద్దామని వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేసి కోరారు. ఉమ్మడి కార్యాచరణతో ఈ సమస్యపై ముందుకు వెళ్ళదామన్నారు.
సీఎం కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావల్సిన అవసరం చాలా ఉందన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్దామని ఆమె బండి సంజయ్, రేవంత్ రెడ్డిలను కోరడం జరిగింది. కలిసి పోరాటం చేయకపోతే కేసీఆర్ తెలంగాణలో ప్రతిపక్షాలను బతకివ్వడని ఆమె పేర్కొన్నారు.
అయితే షర్మిలకు ఇద్దరు నేతల నుంచి సానుకూలంగానే స్పందన లభించింది. కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ షర్మిలకు చెప్పారు. త్వరలోనే కలుద్దామని ఆయన ఆమెతో చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని బండి ఆమెకు స్పష్టం చేశారు.
ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కూడా ఉమ్మడి పోరాటానికి సై అన్నారు. మరో వైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న షర్మిల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోరాటాన్ని సాగిస్తున్నారు. పోలీసులు అడ్డుకుంటునప్పటికీ ఆమె నిన్న పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీఎస్పీఎస్సీ ఆఫీస్ కు చేరుకోవడం హాట్ టాఫిక్ గా మారింది.