కాంగ్రెస్ పార్టీని మూసేద్దామా, ఆప్ గెలిస్తే మనకెందుకు అంత సంతోషం, ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ ఔట్ సోర్సింగ్ చేస్తుందా??? కాంగ్రెస్ అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు వేస్తున్న ప్రశ్నలివి.
Advertisements
కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో తాము గెలవడానికి పోటీ చేస్తుందా లేక బీజేపీ ని ఓడించడానికి పోటీ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటున్న కాంగ్రెస్ కు బలపడాలి అనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ పెద్దల ముందు ఉన్న పెద్ద టాస్క్ ఎవరు గెలిచినా పర్వాలేదు కానీ, బీజేపీ మాత్రం ఓడిపోవాలి. బీజేపీని ఓడించే విషయంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుంది కానీ, కాంగ్రెస్ పునాదులు సైతం కూలిపోతున్నాయి. తాము గెలవకపోయిన సరే బీజేపీ ని గెలవనివ్వొద్దు అనే కాంగ్రెస్ సిద్ధాంతం ఆపార్టీ ని దేశం లో కనుమరుగు చేసేలా ఉంది..
ఢిల్లీ లో ఆప్ భారీ విజయం సాధించడం, బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవ్వడం తో కాంగ్రెస్ పెద్దలు తెగ సంతో షిస్తున్నారు. కేజ్రీవాల్ కు అభినందనలు చెప్తున్నారు. కానీ అదే సమయం లో కాంగ్రెస్ పోటీ చేసిన 70 స్థానాల్లో 63 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. దానిపై కాంగ్రెస్ అగ్రనేతల్లో ఎక్కడ ఆ చర్చ లేదు, కేజ్రీవాల్ కు అభినందనలు చెప్పడానికి పోటీ పడ్డారు. ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పెద్ద దుమరాన్నే రేపుతోంది.
కేజ్రీవాల్ ను అభినందిస్తూ చిదంబరం పెట్టిన ట్వీట్ కు అదే పార్టీకీ చెందిన మహిళ నేత ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిస్ట ముఖర్జీ ఘాటుగా రిప్లై ఇచ్చారు.మనము ప్రాంతీయ పార్టీలకు ఔట్ సోర్సింగ్ చేస్తు న్నామా, ఆప్ గెలిస్తే మనకు ఎందుకు అంత సంతోషం, అలాగైతే ఇక మన పార్టీని మూసేద్దాం అని ఆమె తన రిప్లై లో పేర్కొంది. ఆమె ట్వీట్ లో పేర్కొన్న అంశాలు వంద శాతం నిజం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.