బాలీవుడ్ కింగ్ ఖాన్ …షారుఖ్ , తన దేవదాస్ సినిమా కోసం దాదాపు 12 సినిమాలను పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా దేవదాస్ సినిమా డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ చెప్పాడు…. సంజయ్ దేవదాస్ కథతో షారుఖ్ దగ్గరకు వెళ్లినప్పుడు షారుఖ్ కు సంజయ్ చెప్పిన స్టోరీ బాగా నచ్చిందట…అప్పటికే చేద్దాం అని అనుకుని, తన టేబుల్ పై ఉన్న 12 సినిమాల స్క్రిప్ట్ లను సంజయ్ కు చూపిచాడట… షారుఖ్.!
అయినా ఈ సినిమా కథ పిచ్చిపిచ్చిగా నచ్చడంతో వాటన్నింటినీ పక్కకు పెట్టి….దేవదాస్ కు ఓకే చెప్పాడు, ఈ సినిమాలో షారుఖ్ పక్కన , మాధురీ దీక్షిత్ , ఐశ్వర్యారాయ్ లను నటించారు. ఈ సినిమా షూటింగ్ మద్యలో మాధురీ ఆరోగ్యం పాడై హాస్పిటల్ కు వెళితే తను ప్రెగ్నెంట్ అని కన్ఫామ్ చేశారు. అయినా రెస్ట్ తీసుకోకుండా మాధురీ ఈ సినిమాను కంప్లీట్ చేసింది