ధూమ్ చిత్రానికున్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పటికే దీని నుంచి 3 పార్ట్ లు వచ్చాయి. త్వరలోనే 4 వ పార్ట్ తీయడానికి దర్శకులు రెడీ అయ్యారు. దీని పై యష్ రాజ్ ఫిలిమ్స్ క్లారిటీ ఇచ్చింది.
పఠాన్ తో 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో షారూక్ విలన్ గా నటించనున్నట్లు సిద్దార్థ్ ఆనంద్ ట్వీట్ చేశారు.
2024న క్రిస్టమస్ కానుకగా మన ముందుకు రానుంది. ధూమ్ 4 లో ప్రభాస్ నటించనున్నట్లు గతంలో పలు వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ ను పక్కన పెట్టి షారూక్ ఖాన్ కి అవకాశమిచ్చారు.
పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ మరి ధూమ్ 4 ని ఎలా తెర మీదకి తీసుకుని వస్తాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.