జనవరి 25న విడుదలైన ‘పఠాన్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే మరియు జాన్ అబ్రహం నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ గా నిలిచింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు నెల రోజుల తర్వాత పఠాన్ కలెక్షన్స్ కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా 37వ రోజు రూ.75 లక్షలు రాబట్టింది. దీంతో ఈ సినిమా మొత్తం వసూళ్లు 528.77 కోట్లకు చేరాయి.
షారుక్ సినిమా 36వ రోజు 71 లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. నిజానికి షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె సహా జాన్ అబ్రహం తొలిసారి కలిసి పఠాన్‌లో స్క్రీన్‌ను పంచుకున్నారు. ఈ సినిమాకు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాగా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. YRF స్పై యూనివర్స్‌కి ఇది నాల్గవ సినిమా. ఒక రకంగా ఈ షారుఖ్ ఖాన్ పఠాన్ హిందీ చిత్రసీమ విజయంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.
ఈ సినిమా ద్వారా షారుక్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చాడు. షారూఖ్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు, అందుకే సినిమా థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి జోరు చూపిస్తోంది. విడుదలకు ముందు, బేషరమ్ రంగ్ అనే పాటపై చాలా రచ్చ జరిగినప్పటికీ, సినిమాను థియేటర్‌లో నడపడానికి అనుమతించబోమని, బ్యాన్ చేస్తామని కామెంట్లు చేసినా సినిమా రిలీజ్ అయ్యాక అంతా రివర్స్ అయింది. ఈ సినిమా రావడమే పఠాన్ థియేటర్లలో బ్లాక్ బస్టర్ అని నిరూపితం అయింది.
ఇక ఇప్పుడు ఈ షారుఖ్ ఖాన్ సినిమా దంగల్, కేజీఎఫ్ చాప్టర్ 2, బాహుబలి 2ల రికార్డులను కూడా బీట్ చేసింది. పఠాన్ హిందీ వెర్షన్ 500 కోట్ల మార్కును దాటేసింది. పఠాన్ హిందీ బాక్సాఫీస్ వద్ద రూ.510.55 కోట్లు రాబట్టింది.
ఇక బాహుబలి 2 హిందీలో 510 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 హిందీలో 435.33 కోట్లు, దంగల్ 374.43 కోట్లు రాబట్టింది. దీని ప్రకారం, ఇది ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించాడు. ఇక పఠాన్ భారీ వసూళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ తదుపరి చిత్రం జవాన్ కు మార్గం సుగమం అయింది. ఇప్పుడు ఈ జవాన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.