తన తాజా మూవీ ‘జవాన్’ చిత్రం షూటింగ్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ మధ్యే ప్యాకప్ చెప్పాడు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మొదటిసారిగా ఈ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఈ సినిమా పోస్టర్స్ చూస్తే ఇది కచ్చితంగా యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పవచ్చు .
అట్లీతో కలిసి పని చేయాలని షారుఖ్ ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈ సినిమాలో సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార షారుఖ్ హీరోయిన్.. ఇక తమిళ స్టార్స్ దళపతి విజయ్, విజయ్ సేతుపతి ఈ మూవీకి ఎస్సెట్స్..
ఇటీవల అట్లీ బర్త్ డేని ‘జవాన్’ సెట్స్ పై సెలబ్రేట్ చేసుకున్నప్పుడు షారుఖ్, విజయ్ కూడా కలిసి సందడి చేశారు. దీంతో సోషల్ మీడియాకి పండగే పండగ ! ఇందులో దళపతి విజయ్ ది స్పెషల్ అపియరెన్స్ అయితే దీపికా పదుకోన్ కూడా ఓ కేమియో అపియరెన్స్ ఇవ్వబోతోంది. ఇంకా ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగి బాబు, సునీల్ గ్రోవర్ ఇతర తారాగణం.
అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న జవాన్ మూవీ వచ్చే ఏడాది జూన్ 2 న రిలీజ్ కాబోతోంది. తెలుగుతో సహా అయిదు భాషల్లో వస్తోందీ పాన్-ఇండియా చిత్రం.