రష్మిక మందన్న, శర్వానంద్ జంట గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ నేపథ్యంలో తెరక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే ఆడవాళ్లు మీకు జోహార్లు టీం మీడియా ముందుకు వచ్చారు. వారి అనుభవాలను గురించి మాట్లాడారు. ఈ సినిమా గురించి శర్వా మాట్లాడుతూ.. సినిమా చూసి అందరూ తప్పకుండా నవ్వుతూ వెళ్లిపోతారని అన్నారు.
రాధిక, ఖుష్బూతో కలిసి నటించడం గొప్ప అచీవ్మెంట్ అని, సెట్స్‌లో వారితో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా తాను చాలా నేర్చుకున్నానని చెప్పాడు శర్వానంద్.
చివరగా చెప్పాలంటే, రష్మిక లాంటి ప్రొఫెషనల్ నటిని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని, ఆమె సినిమాకు చాలా ఆకర్షణ, ఉత్సాహాన్ని తెచ్చిందన్నారు శర్వా. ఇక ఈ సినిమాకు డిఎస్పీ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.