యంగ్ హీరో శర్వానంద్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి 10ఏళ్ళకి పైనే అవుతుంది. అయితే రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు మినహా మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.
ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో తనను దాటేసిన చాలా మంది యువ హీరోల మాదిరిగానే శర్వానంద్ కూడా రెమ్యునరేషన్ పై ఎక్కువ దృష్టి పెట్టాడట.
తన డేట్స్ కావాలంటే రెమ్యూనరేషన్‌గా ₹10 కోట్లు ఇవ్వాల్సిందేనని చెబుతున్నాడట. కొంతమంది పెద్ద నిర్మాతలు శర్వా కు మంచి ప్రాజెక్ట్‌లను ఆఫర్ చేస్తున్నప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో ఆఫర్‌లను తిరష్కరిస్తున్నాడట.
నిజానికి టాలీవుడ్ లో రవితేజ కూడా కొన్నేళ్లు అదే పని చేశాడు. కానీ సినిమాలు మాత్రం హిట్ కాలేదు. చివరికి క్రాక్ తో హిట్ కొట్టాడు. వెంటనే “ఖిలాడి” తో ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు. మరి శర్వానంద్ కెరీర్ ఈ నిర్ణయంతో ఎటువైపుకు వెళ్తుందో చూడాలి.