శర్వానంద్ హీరోగా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా చేస్తున్నాడు.
అలాగే దీనితో పాటు మరో సినిమా చేయబోతున్నాడట శర్వానంద్. ఇందులో కృతి శెట్టితో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నారట.
కృతి శెట్టి ప్రస్తుతం ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజక వర్గం సినిమాలతో బిజీగా ఉంది. నిజానికి కృష్ణ చైతన్య నితిన్‌తో పవర్ పేట సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే ఈ కథ శర్వానంద్ మహాసముద్రంను పోలిఉండటం తో నితిన్ ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టాడు.
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో రష్మిక మందన్నతో రొమాన్స్ చేసిన ఆకట్టుకున్న శర్వానంద్ ఇప్పుడు కృతి తో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.