ఊహించని విధంగా శర్వానంద్ కు షాక్ తగిలింది. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసుకొని, ప్రచారం కూడా ప్రారంభించి, అంతా సెట్ చేసుకున్న టైమ్ లో రాత్రికిరాత్రి భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ప్రకటించారు. దీంతో శర్వానంద్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతడు నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల డైలమాలో పడింది.
ఇంతకీ ఈనెల 25న భీమ్లానాయక్ తో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వస్తుందా రాదా అనే చర్చ జోరందుకుంది. కొంతమంది శర్వానంద్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటున్నారు. మరికొందరు మాత్రం పవన్ సినిమాతో పాటు శర్వా సినిమా వస్తుందంటున్నారు. శర్వానంద్ మాత్రం మధ్యేమార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అటు పవన్ కు పోటీగా రాకుండా, మరోవైపు తన సినిమాను వాయిదా వేసుకోకుండా.. మంచి ప్లాన్ వేశాడు ఈ హీరో.
తాజా సమాచారం ప్రకారం.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వస్తుంది. అంటే.. భీమ్లానాయక్ వచ్చిన 24 గంటల తర్వాత శర్వా సినిమా రిలీజ్ అవుతుందన్నమాట. ఇలా చేయడం వల్ల పోటీని తట్టుకున్నట్టు అవుతుందని, మరోవైపు వసూళ్లపై ప్రభావం పడదని ‘ఆడవాళ్లు’ యూనిట్ భావిస్తోంది.
మరి నిజంగానే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను ఫిబ్రవరి 26కు రిలీజ్ చేస్తారా లేక వాయిదా వేస్తారా అనే విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. అన్నట్టు భీమ్లానాయక్, శర్వానంద్ సినిమాతో పాటు రావాల్సిన గని మూవీని మరోసారి వాయిదా వేశారు. పవన్ రంగంలోకి దిగడంతో వరుణ్ తేజ్ సినిమాను వాయిదా వేయక తప్పలేదు.