Rx100 దర్శకుడు అజయ్ భూపతితో శర్వానంద్ సినిమా చేస్తున్నాడా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. RX100 సినిమా తరువాత మహా సముద్రం అనే కథతో ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నారు అజయ్ భూపతి. పక్కా మాస్ కథతో మొదట అజయ్ భూపతి రవితేజను అనుకున్నాడు ఆ తరువాత నాగ చైతన్య, ఆ తరువాత కార్తికేయ…ఇప్పుడు శర్వానంద్.
అయితే కథ అందరి హీరోలకు నచ్చినప్పటికీ ఏదో ఒక కారణం చెప్పి తప్పుకున్నారు. కానీ శర్వానంద్ మాత్రం మహా సముద్రం కథకి పచ్చజెండా ఉపేశాడని తెలుస్తుంది. అయితే ఈ కథ కు ఇద్దరు హీరోలు కావాలట. శర్వానంద్ ఒప్పుకున్నాడు కాబట్టి ఇక రెండో హీరోని పట్టుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. ఇక పోతే అన్నీ బాగున్నప్పటికి శర్వానంద్ కథకు సూట్ అవుతాడా అనే ప్రశ్న ఫిలింనగర్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రణరంగం అనే మాస్ సినిమా తీసి పరాజయాన్ని మూటగట్టుకున్నాడు శర్వానంద్. ఇప్పటివరకు శర్వా చేసిన మాస్ సినిమాలు ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ కొట్టలేదు. కాబట్టి శర్వానంద్ కు ఈ కథ సెట్ అవుతుందో లేదో అని అనుకుంటున్నారు. కానీ మాస్ సినిమాతో ప్రేక్షకుల ను మెప్పించాలనే కసితో శర్వా ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం శర్వానంద్ సమంత జంటగా తమిళ్ రీమేక్ సినిమా 96 లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14 న రిలీజ్ కానుంది.