తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన 96 మూవీ రీమేక్ లో శర్వానంద్, సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు సంబందించిన రీమేక్ రైట్స్ దిల్ రాజు తెచ్చుకున్నాడు. మొదట డైరెక్టర్ గా ఎవరు చేస్తారనేది సస్పెన్స్ గా ఉండేది. ఆ సమయంలో తమిళ్ లో డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ నే రంగంలోకి దింపాడు దిల్ రాజు. సినిమా ప్రారంభం నుంచి కూడా ఒక్క అప్డేట్ కూడా ఈ సినిమా నుంచి రాలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటివరకు సినిమా టైటిల్ ని కూడా ప్రకటించని చిత్ర యూనిట్ ఈ సినిమాకి జాను అనే టైటిల్ ను ఖరారు చేసింది. ఎడారిలో ఒంటెలను చూస్తూ శర్వానంద్ ని చూపిస్తాడు దర్శకుడు. అయితే శర్వా పేస్ మాత్రం క్లారిటీ గా చూపించలేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ చెయ్యని దిల్ రాజు ఇక నుంచి అప్డేట్స్ ఇస్తూనే సినిమా పై బజ్ పెంచాలని చూస్తున్నాడు.