టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో మంచి జోష్ మీద ఉన్నాడు. ఇటీవల జానుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వా చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఇది కాకుండా మరో సినిమాకు శర్వా ఒకే చేశాడు. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రంలోనూ నటిస్తుండగా, కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
మరోవైపు ఆర్ ఎక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి డైరెక్షన్లో మహాసముద్రం మూవీ చేయబోతున్నాడు. ఇవేకాక తాజాగా శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి నిర్మాణంలో శర్వానంద్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు తెలిపారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్టర్, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.