బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంచలనంగా మారింది. ఆత్మహత్యకు బాలీవుడ్లోని బంధుప్రీతి కారణమంటూ సినీ ప్రముఖులు సుశాంత్ అభిమానులు ఆరోపించారు. మరోవైపు సుశాంత్ ది ఆత్మహత్య కాదని హత్య అంటూ మరికొంతమంది వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుశాంత్ కేసును సిబిఐ కు సుప్రీంకోర్టు అప్పగించింది.
ఇదిలా ఉండగా సుశాంత్ జీవిత కథ ఆధారంగా కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే సూసైడ్ ఆర్ మర్డర్ స్టార్ వజ్ లాస్ట్ అనే చిత్రాన్ని అఫీషియల్ గా ప్రకటించగా తాజాగా మిశ్రా దర్శకత్వంలో శశాంక్ అనే చిత్రాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. సినిమా ఇండస్ట్రీలో బంధుప్రీతి కారణంగా యంగ్ హీరో ఎలా మృతి చెందాడు వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుందట. ఆర్య బబ్బర్, రాజ్ వీర్ సింగ్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.