మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత శశిథరూర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజలపై ధరల భారం విపరీతంగా పెరిగిపోయిందన్నారు.
ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. నిత్యావసరాల ధరలు కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎలా ఉన్నాయో పోల్చుతూ ట్వీట్ పెట్టారు. ధరల పెరుగుధలపై ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.
‘ కాంగ్రెస్, బీజేపీ పాలనకు మధ్య మరో వ్యత్యాసాన్ని చూడండి. మీరు రోజూ వీటిని అనుభవిస్తున్నారు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో పాటు కాంగ్రెస్, బీజేపీ పాలనలో నిత్యావసరాల ధరలు ఎలా ఉన్నాయో వివరించే చార్టును ఆయన షేర్ చేశారు.
వనస్పతి నూనె ధరల్లో 118 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. పామ్ ఆయిల్ (ప్యాకింగ్ చేసిన) ధర రూ. 109 శాతం పెరిగింది. బియ్యం, గోధుమలు, చెక్కర, పాలు, టీ, ఉప్పు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, టొమాటో ధరలు 10 నుంచి 60 శాతం వరకు పెరిగాయి.