దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతుండటంపై కేంద్రాన్ని ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. పన్నుల పెంపు, ధరల పెంపు అనేవి బీజేపీ ప్రభుత్వానికి హాల్ మార్క్ గా మారిపోయాయని ఆయన విమర్శించారు.
పెట్రోల్ ధరల పెంపు తాము ముందుగా ఊహించిందేనన్నారు. ఇలా ప్రతి రోజూ ధరలు పెంచడమంటే ప్రజలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.
నవంబర్ 2021 తర్వాత మొదటి సారిగా పెట్రోల్, డీజిల్ ధరలను ఈ ఏడాది మార్చిలో పెంచారు. అప్పటి నుంచి వరుసగా ఆరు రోజుల్లో ఐదు సార్లు పెట్రోల్ ధరలు పెరగడం గమనార్హం.
దేశంలో ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు 50 పై, 55 పైసల పెరిగాయి. దీంతో ఈ వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటి వరకు రూ. 3.70, రూ 3.75 పైసల వరకు పెరిగాయి.