తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యమైన ములుపులు చోటుచేసుకోనున్నాయా… అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఉప్పు-నిప్పుగా ఉన్న పళనిస్వామి-పన్నీరు సెల్వంకు చెందిన ఏఐడీఎంకే, సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ మళ్లీ ఐక్యతారాగం వినిపించే అవకాశం కనపడుతుంది.
జైలు నుండి వస్తూనే… అన్నాడీఎంకే పార్టీ మాదే అంటూ శశికళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఎలాగైనా సీఎం స్థానంలో ఉండాలన్నది ఆమె కల. కానీ సీఎం పళనిస్వామితో పాటు పన్నీరుసెల్వం కలిసి ఆమె ప్రయత్నాలకు గండికొడుతున్నారు. కానీ ఈ మధ్యలో అధికారాన్ని ఎగురేసుకపోయేందుకు డీఎంకే రెడీగా ఉంది.
దీంతో మధ్యేమార్గంగా అన్నాడీఎంకేలో గ్రూపులన్నీ కలిసిపోయేలా ఉన్నాయి. జయలలితకు నివాళి అర్పిస్తూ… అన్నాడీఎంకే 100 సంవత్సరాలు ప్రభుత్వంలో కొనసాలన్నది ఆమె అభిమతం అని, అందుకు మనమంతా పనిచేయాలంటూ ప్రకటన జారీ చేసింది. త్వరలోనే అందర్నీ కలుస్తానని పేర్కొంది. దీంతో అన్ని వర్గాలు కలిసిపోనున్నాయన్న చర్చ ఊపందకుంది.