కర్నాటకలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరి పిల్లలకు ప్రయాణంలోనే జన్మనిచ్చింది. చామరాజనగర్ జిల్లాలోని కౌడల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన శేషన్న, జ్యోతికి కొన్నాళ్ల క్రితం పెళ్లి జరిగింది.
రెండేళ్ల క్రితం ఓ బిడ్డికి జన్మనిచ్చిన జ్యోతి తాజాగా మరోసారి ప్రసవం అయింది. అయితే.. సడెన్ గా ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు జ్యోతి డెలివరీ కావడం కష్టమని.. ఆమెకు రక్తం ఎక్కించాలని చెప్పారు.
ఈ కేసుని తాము డీల్ చేయలేమని చెప్పారు. ఆ వైద్యుల సూచన మేరకు పెద్ద ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ ని పిలిపించారు. అయితే.. పెద్ద ఆస్పత్రికి చేరుకునే లోపే అంబులెన్స్ లో డెలివెరీ అయింది. తరువాత ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. వారిని పరిశీలించిన వైద్యులు తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.
మొదటి కాన్పు కూడా ఆస్పత్రికి తీసుకువెళ్తున్న సమయంలో ఆటోలో జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇద్దరు పిల్లలు ప్రయాణంలోనే జన్మించారని అన్నారు.