రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితురాలు నిహారిక జైలు నుంచి విడుదల అయింది. ఈ కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న నిహారికకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిహారిక చర్లపల్లి జైలు నుంచి ఇవాళ ఉదయం విడుదల అయింది.
ఫిబ్రవరి 6న నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు సహకరించిన అతని స్నేహితుడు హసన్, నిహారికను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన విషయాన్ని దాచి, హత్యకు సహకరించినందుకు గాను నిహారికను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్ని హయత్ నగర్ కోర్ట్ లో హాజరు పరుచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
అయితే, ఇటీల బెయిల్ కోసం నిహారిక దరఖాస్తు చేసుకోగా.. శనివారం ఆమెకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఇక నిహారిక కోసమే హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్ మెట్ వద్ద నవీన్ ని హత్య చేశాడు. తరువాత నవీన్ శరీరాన్ని ముక్కలుగా కోసి గుండె, ఇతర శరీర భాగాలను ఫోటో తీసి నిహారికకు వాట్సాప్ ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే అలా హరిహర పంపిన ఫోటోలకు స్పందించిన నిహారిక.. వెల్ డన్ గుడ్ బాయ్.. అంటూ రిప్లే ఇవ్వడం అందర్ని షాక్ కు గురిచేసింది. అయితే ఈ వాట్సాప్ చాట్ ద్వారానే నవీన్ హత్య కేసులో నిహారిక ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను కూడా ఈ మర్డర్ కేసులో ఏ3 గా చేర్చడం జరిగింది.