దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా మర్డర్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఆమె చనిపోలేదని.. బతికే ఉందంటూ షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా సీబీఐకి లేఖ రాసింది. కశ్మీర్‌లో ఉన్న షీనా బోరా ఆచూకీ కనిపెట్టాలని లేఖ ద్వారా అధికారులను కోరింది. ఈ వ్యవహారంపై ఇంద్రాని ప్రత్యేక సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా వేసిందని.. త్వరలోనే న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
కొన్నేళ్ల క్రితం థ్రిల్లర్ సినిమాను తలపించేలా షీనా బోరా మర్డర్ మిస్టరీ కొనసాగింది. ఆమె హత్య కేసులో అరెస్ట్ అయిన ఇంద్రాణి 2015 నుంచి ముంబైలోని బైకుల్లా జైలులో ఉంటోంది. అక్కడ ఓ మహిళా ఖైదీ తనను కలిసిందని.. షీనాను కశ్మీర్ లోయ ప్రాంతంలో చూసినట్లు తనకు చెప్పిందని ఇంద్రాణి సీబీఐకి రాసిన లేఖలో వివరించింది.