పాకిస్థాన్ కొత్త ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష పీఎంఎల్‌ఎన్ నేతగా ఉన్న 70 ఏళ్ల షెహబాజ్.. పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. ఇతను పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు కావడం గమనార్హం.
ప్రధాని ఎన్నిక కోసం.. సోమవారం నేషనల్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. గత అధికార పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ సభ్యుల రాజీనామాతో ఏర్పడిన ప్రతిష్టంబనను.. తొలగించేందుకు ఓటింగ్ నిర్వహించింది. ఈ ఓటింగ్ లో షెహబాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పాక్ ప్రధాని రేసు కోసం పీటీఐ నుంచి షా మహమ్మద్ ఖురేషీ, షెహబాజ్ షరీఫ్ ఇద్దరూ పోటీపడ్డారు. అయితే.. పీటీఐ సభ్యుల మూకుమ్మడి రాజీనామాతో ప్రభుత్వం కుప్పకూలింది. ఈ మేరకు ఖురేషీ అభ్యర్థిత్వానికి బలం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. షెహబాజ్ షరీఫ్ 2018లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
కాగా.. ఒక ప్రధానిని అవిశ్వాస తీర్మానంతో గద్దె దించడం పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి. 174 ఓట్లతో ఇమ్రాన్ ఖాన్ ను ప్రధాని పదవి నుంచి దింపేశారు.