బిగ్‌బాస్ సీజన్ 3 సగం రోజులకు పైగా పూర్తయి గ్రాండ్ ఫినాలేలో హాట్ ఫేవరెట్స్ ఎవరెవరో అంచనాకు వస్తున్న సందర్భంలో ఈవారం ఎలిమినేట్ అయ్యేదెవరు.. అనేది కొంత ఇంట్రస్టింగ్‌గా వుంది. నూతన్‌నాయుడు దీనిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు.
ఎలిమినేషన్ లిస్టులో శ్రీముఖి, పునర్నవి, హిమజా సేఫ్ అవుతున్నారని, ఇక.. మహేశ్ అండ్ శిల్పా చక్రవర్తిలలో అవకాశాలు ఎక్కువగా శిల్పకే వున్నాయని నూతన్‌నాయుడు చెప్పారు. పెర్ఫామెన్స్ నిరూపించుకునేంత సమయం కూడా లేకుండానే వీక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని హాట్‌స్టార్ ఓటింగ్ ట్రెండ్స్ అనుగుణంగా చెప్పాల్సివస్తే శిల్ప ఎగ్జిట్ అవ్వడం ఖాయమని అనిపిస్తోందని నూతన్‌నాయుడు అంటున్నారు. శిల్ప వున్న రెండేవారాలలో తను మిగిలిన హౌస్మేట్స్‌తో పెద్దగా మింగిల్ అవ్వలేకపోయిందని, నాగార్జునతో మాట్లాడే సందర్భంలో కూడా కన్విన్సింగ్‌గా కాకుండా కంప్లయింట్ చేస్తున్న ధోరణిలో మాట్లాడ్డం కూడా వీక్షకుల్లో శిల్ప పట్ల నెగటీవ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యివుండచ్చునని అంచనావేస్తున్నారు. ఇక, హౌసులో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా వున్న శ్రీముఖి తన పెర్ఫామెన్స్, ఎనర్జీ లెవల్స్, యాక్టీవ్‌నెస్ స్ట్రాంగ్‌గా వున్నప్పటికీ ఇటీవలి హౌసులో ఆమె ప్రవర్తనను బట్టి రోజురోజుకీ క్రేజ్ తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తోందని నాయుడు చెబుతున్నారు.