బిగ్‌బాస్ హౌసులోకి ఎవరొస్తారబ్బా ? హెబ్బానా, లేక రెబ్బానా? అని వన్ వీక్ నుంచి టెన్షన్ పడిపోతున్న బీబీ ఫాన్స్‌కు ఊరట కలిగించే న్యూస్ ఇది. బిగ్‌బాస్ హౌసులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శిల్పా చక్రవర్తి వస్తోంది. వీకెండ్ ఎపిసోడ్ ఎండ్ కార్డు తరువాత స్టార్‌మా చూపించిన టీజర్‌లో వెనక నుంచి చూపించిన ఒక లేడీ ఫిగర్‌ను చూశాక జనానికి అందరికీ వైల్డ్ కార్డ్ అయితే వుంటుందని క్లారిటీ వచ్చేసింది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరో కాదు, ఆనాటి బుల్లితెర యాంకర్ శిల్పా చక్రవర్తి అని కత్తి మహేశ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి చాటేశాడు. బీబీ నుంచి ఈసారి గత రెండు సీజన్లలో ఎప్పుడూ లేనిది లీకులు బాగా వస్తున్నాయి. ఎన్ఎన్ టీవీ ప్రారంభించి బిగ్‌బాస్ అప్డేట్స్ ఇస్తున్న సీజన్ టూ ఫేమ్ కామన్‌మ్యాన్ నూతన్ నాయుడు బీబీ ప్రారంభం అయిననాటి నుంచి చేస్తున్న విశ్లేషణలు, అంచనాలన్నీ తు.చ.తప్పకుండా నిజమవుతున్నాయి. జనం కూడా టెన్షన్ తట్టుకోలేక నూతన్‌నాయుడు ఏం చెబుతాడా అని ఆసక్తిగా వినేసి బయట టాక్ స్ప్రెడ్ చేసేసుకుంటున్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎన్ఎన్ టీవీ చెప్పినంత కచ్చితంగా మరెవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఈవారం ఎలిమినేషన్ లేదని మొట్టమొదట తెలియజేసింది నూతన్‌నాయుడే. ఆ వీడియో ఇప్పటివరకు 79 వేల మంది చూశారంటే అతనికి వున్న ఫాలోయింగ్ ఏంటో అర్ధం అవుతోంది. ఈసారి కత్తి మహేశ్ రంగంలోకి దిగాడు. బిగ్‌బాస్ హౌసులో ఏం జరుగుతుందో కత్తి మహేశ్ కూడా కరెక్టుగానే అంచనా వేయగలడు. ఎందుకంటే తను గత సీజన్‌లో బీబీ హౌసుకి వెళ్లొచ్చాడు కనుక. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శిల్పా చక్రవర్తి వస్తుందని కత్తి మహేశ్ అందరికన్నా ముందుగా లోకానికి చెప్పాడు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » హెబ్బా, రెబ్బా కాదు, శిల్పా!