కత్తి మహేశ్ చెప్పిందే కరెక్టయ్యింది. బుల్లితెర సీనియర్ యాంకర్ శిల్పాచక్రవర్తి బిగ్‌బాస్ హౌసులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ రోజుల్లో సుమ, ఝాన్సీలతో సమానంగా బుల్లితెరను ఏలిన శిల్ప సడెన్‌గా బీబీ హౌసులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. శిల్పాచక్రవర్తి బెంగాల్ టైగర్ అయినప్పటికీ, ఆమె తెలుగులో చాలా చక్కగా మాట్లాడేస్తుంది. అందుకే అన్నాళ్లు బుల్లితెరని ఏలేసింది.
శిల్ప రావడం రావడమే హౌస్మేట్స్ అందరికీ భలే షాకిచ్చింది. కన్ఫెషన్ రూమ్‌లోకి ఇద్దరేసి హౌస్మేట్స్‌ని పిలిపించి వారికక్కడ ఒక మానిటర్‌లో చీకట్లో కనీకనిపించని లైట్ ఎఫెక్టులో ఒక మిస్టరీ ఫ్రెండుగా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ దర్శనమిచ్చింది. నిజంగానే శిల్పాని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. బహుముఖి శ్రీముఖి కనిపెట్టేస్తుందని ఆమె దగ్గర కాస్త జాగ్రత్తపడి శిల్ప గొంతు మార్చింది.
శిల్పా ఎంట్రీని బిగ్‌బాస్ భలే తెలివిగా ప్లాన్ చేశాడు. ఈవీక్ ఎలిమినేషన్ లిస్టు శిల్ప ద్వారానే ప్రిపేర్ చేయించాడు. ఇక్కడే బిగ్‌బాస్ మాస్టర్‌ప్లాన్ బయటపడింది. ఎవరెవరు ఎవరెవరి గురించి ఏమని అనుకుంటున్నారో హౌస్మేట్స్ నోటితోనే చెప్పించాడు. కాకపోతే, వాళ్ల గురించి మాట్లాడుతూ శిల్ప చాలా క్లూస్ ఇచ్చేసింది. శిల్పకు ఇచ్చిన స్క్రిప్ట్ బిగ్‌బాస్ స్క్రిప్టే కాబట్టి.. ఆమె ఎక్స్‌ప్రెస్ చేసిన ఒపీనియన్స్ అన్నీ బిగ్‌బాస్ ఒపీనియన్స్‌గా భావించాలి. ఈ ఒపీనియన్స్ ప్రకారం శ్రీముఖి బిగ్‌బాస్ హౌసులో బిగ్ కంటెస్టెంట్. అలాగే, మహేశ్ విట్టా గేమ్ బాగా ఆడుతున్నాడు. వరుణ్ సందేశ్ కూడా ఫుల్ మార్కులు వచ్చాయి. శిల్ప ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఇవన్నీ బిగ్‌బాస్ అభిప్రాయాలుగానే మనం తీసుకోవాలి. దీన్నిబట్టి చివరి వరకు పోటీలో నిలిచేది వరుణ్ సందేశ్ అండ్ శ్రీముఖి. ఇది ఖాయం చేసుకోండి ప్రస్తుతానికి.
Advertisements
ఇక, కన్ఫెషన్ రూములో బాబాభాస్కర్ అండ్ శ్రీముఖి బాగా నవ్వించారు. వాళ్ల సంభాషణ చాలా సరదాగా సాగింది. ఇక, ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి రాహుల్, అలీ, మహేష్, రవి, శ్రీముఖి నామినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శిల్పా గురించి చీకట్లో హిమజా, శ్రీముఖి కలిసి కాసేపు గుసగుసలాడారు. తెలుగును ఇంగ్లీష్ శ్లాంగ్‌లో మాట్లాడుతూ ఆ కాసేపూ ఇద్దరూ బాగా ఎంటర్‌టైన్ చేశారు.
హిమజా, శ్రీముఖి.. హౌసులో బాగా ఆడుతున్నారు. ఎవరూ తక్కువ కాదు. బాబాభాస్కర్, శ్రీముఖి, వరుణ్, వితిక, రాహుల్, మహేశ్, రవి, అలీ, హిమజా, నవీ, ఇప్పుడు శిల్పా.. వీళ్లల్లో ఎవర్ని పంపించినా హౌసులో కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సవుతుంది.
అన్నట్టు హౌస్మేట్స్ గణేశ చతుర్ధి బాగా జరుపుకున్నారు. హౌస్మేట్స్ పూజ చేసుకోడానికి వీలుగా బంతిపూలు, తోరణాలు, అరటి ఆకులు, పండ్లు, స్వీట్లు బిగ్‌బాస్ పంపించారు. బిగ్‌బాస్ ఆదేశాల ప్రకారం హౌస్మేట్స్ అందరూ ఒకరి తరవాత ఒకరు కెమెరా ముందుకొచ్చి ఒక అగరబత్తిని వెలిగించి వాళ్ల వాళ్ల కోరికలు చెప్పుకున్నారు. హిమజా చాలా గట్టి కోరికే కోరింది. నవంబర్ 2న ఆమె పుట్టినరోజు. అంటే, బిగ్ బాస్ షో ఫైనల్ వీక్. కాబట్టి, ఈ ఏడాది తన పుట్టినరోజును బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రేట్ చేసుకోవాలని ఆమె కోరుకుంది. దీనికి ప్రేక్షకుల దీవెనలు తనకు కావాలని వేడుకుంది. భలే ప్లాన్! కామెడీ మాస్టర్ బాబాభాస్కర్ అయితే ఎవరికీ వినిపించకుండా తమిళంలో గణనాథుడిని ఏదో అడిగేశాడు.