భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత ఎక్కడా కనిపించని శిల్పాశెట్టి… అన్నీ మర్చిపోయి తిరిగి తన పనులు తాను చూసుకుంటోంది. బుల్లితెరలో ప్రసారమయ్యే సూపర్ డాన్స్ రియాల్టీ షోలో ఎట్టకేలకు పాల్గొంది. ఈ షోకి ఆమె జడ్జీగా వ్యవహరిస్తోంది. తాజాగా శిల్పాశెట్టి షూటింగ్ లో పాల్గొన్న ఫోటోలు, వీడియో బయటకొచ్చాయి.
శిల్పా షూటింగ్ లో పాల్గొన్న ఫోటోలు, వీడియో చూసి… నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అన్నీ మర్చిపోయింది.. తనకు భర్త గురించి ఎలాంటి బాధ లేదని కొందరు… జరిగిందేదో జరిగింది.. ఆల్ ది బెస్ట్ అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
2009లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది శిల్పాశెట్టి. పోర్నోగ్రఫీ కేసులో ఆయన నెలరోజుల క్రితం అరెస్ట్ అయ్యాడు.