బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి కుంద్రా అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయస్సు పెరిగినా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం.
ఇటీవల ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో స్ట్రాప్ లెస్ గౌనులో కనిపించిన శిల్పా కుర్రాళ్లలో హీట్ పుట్టించింది.
రెడ్ డ్రెస్ లో అమ్మడు అందాన్ని చూసిన కుర్రాళ్ళ మతులు పోయాయి. ముఖ్యంగా డిజైనర్ గాబీ చార్బాచీస్ రూపొందించిన డ్రెస్ లో శిల్ప మరింత అందంగా మెరసిపోయింది.
రెడ్ డ్రెస్ పై గ్రీన్ కలర్ యాక్సెరీస్ వేసుకుని నడుస్తూ ఫోటోలకు ఆమె ఫోజ్ ఇచ్చారు. ఫోటోలో ఆమెని చూసి రెడ్ డ్రెస్ లో మెరిసిన పాలరాతి శిల్పం అని కుర్రకారు ఆమె అందాన్ని అభివర్ణిస్తున్నారు.