పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడు, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఇవాళ కూడా ఆయనకు బెయిల్ లభించలేదు. బెయిల్ యత్నంలో విఫలమవటం కుంద్రాకు ఇది మూడోసారి. తాజాగా బాంబే హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
రాజ్ కుంద్రా బాలీవుడ్ మోడల్స్ తో పోర్న్ వీడియోలను తీసి యాప్ లలో అప్ లోడ్ చేస్తున్నారనే ఆరోపణలతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. దీంతో రాజ్ కుంద్రాకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అటు..ఇప్పటికే కుంద్రా ఇంట్లో పలుమార్లు సోదాలు జరిపిన పోలీసులు కీలకమైన డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు.