కరోనా వైరస్ కారణంగా మహారాష్ట్రలోని షిరిడీ ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. షిరిడీ రావాలనుకునే భక్తులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం చాలా అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో వైరస్ వేగంగా విస్తరిస్తోది. ఇప్పటికే 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో ఒకరు చనిపోయారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదు. సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు రద్దు చేశారు. నాగ్ పూర్ లో నయితే 144 సెక్షన్ విధించారు.