జమ్ము కశ్మీర్ లో ఇటీవల ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన కశ్మీరి పండిట్ల కుటుంబాలను శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది గురువారం పరామర్శించారు.
కశ్మీరి పండిట్లకు శివసేన పార్టీ ఇటీవల తన సంఘీ భావాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో పార్టీ తరఫున మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి తమ పార్టీ అండగా ఉంటుందన్న సందేశాన్ని ఆమె ఇచ్చారు.
లోయలో ఉన్న కశ్మీరి పండిట్లకు భద్రతను పెంచాలని, వారికి రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆమె ఇటీవల లేఖ రాశారు. కశ్మీరి పండిట్ల హత్యలపై కేంద్రాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే తీవ్రంగా విమర్శించారు.
అవసరమైతే ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని, కానీ కాశ్మీరి పండిట్లను నిస్సహాయులుగా వదిలిబెట్టబోమని కేంద్రం తెలిపిందని ఠాక్రే అన్నారు. పండిట్లు క్షేమంగా లోయకు తిరిగి వస్తారని వాగ్దానం చేసిందని కేంద్రంపై శివసేన విమర్శలు గుప్పించింది. కానీ ఇప్పుడు వారు ఎదుర్కొన్నదంతా హింస మాత్రమే అని ఆయన అన్నారు.