శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈడీ కస్టడీని పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆయన కస్టడీని ఈనెల 8 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యేక న్యాయస్థానం వెల్లడించింది.
రాత్ కస్టడీ ఈ రోజుతో ముగియాల్సి వుండగా పీఎంఎల్ ఏ ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన్ని ఈడీ అధికారులు హాజరుపరిచారు.
కస్టడీ పొడిగింపుపై సంజయ్ రౌత్ సోదరుడు సునీల్ రౌత్ స్పందించారు. తమకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని అన్నారు.
రౌత్ నిజమైన శివసేన సైనికుడని ఆయన అన్నారు. రౌత్ ఎప్పుడూ అవినీతికి పాల్పడరని ఆయన పేర్కొన్నారు. రౌత్ ను చూసి బీజేపీ భయపడుతోందన్నారు.