మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు రకరకాల మలుపులు తీసుకుంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ చేతులెత్తేయటంతో… గవర్నర్ శివసేనకు నిర్ణిత సమయంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అయితే, శివసేన ఇంకాస్త గడువు కోరినా గవర్నర్ నిరాకరించటంతో శివసేన ఫైర్ అవుతోంది.
తమకు గడువు పొడగించకపోవటంపై శివసేన సుప్రీం తలుపు తట్టింది. సుప్రీంలో శివసేన తరుపున కాంగ్రెస్ సీనీయర్ నేత, సీనీయర్ లాయర్ కపిల్ సిబల్ వాదించబోతున్నారు. తాము మూడు రోజుల సమయం కోరితే నిరాకరించటమే ప్రధానంగా శివసేన సవాల్ చేస్తోంది.