ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చేందుకు శివసేన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో శివసేన ఎంపీల ఒత్తిడికి ఆ పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే లొంగిపోయినట్టు తెలుస్తోంది.
ముర్ముకు సపోర్ట్ విషయంపై ఠాక్రేతో శివసేన ఎంపీలు సోమవారం చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎంపీల ఒత్తిడితో ముర్ముకు మద్దతిచ్చేందుకు ఠాక్రే ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతొ విపక్ష పార్టీలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది.
ఈ విషయంపై శివసేన ముఖ్య నేత, ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చే విషయంపై సమావేశంలో చర్చించినట్టు ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
ద్రౌపది సపోర్ట్ ఇవ్వడమంటే బీజేపీకి మద్దతివ్వడం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో శివసేన చీఫ్ ఠాక్రే ఓ నిర్ణయం తీసుకుంటారని, మరో రెండుల్లో నిర్ణయాన్ని పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.