మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు శివసేన నుంచి ఇద్దరు, ఎన్సీపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. శివాజీ పార్క్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఏక్ నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, చగన్ బుజ్ బల్, జయంత్ పాటిల్, బాలాసాహెబ్ థొరాట్, నితిన్ రౌతు ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు పలువురు రాష్ట్ర, జాతీయ నాయకులు హాజరయ్యారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై దాదాపు నెల రోజులుగా సాగుతున్న రాజకీయ డ్రామాకు తెరపడింది.