శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి చెందిన ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రకటించిన వెంటనే తీవ్ర మనస్థాపానికి గురైన శివసేన యువ నేత రమేష్ సోలంకి ట్విట్టర్ వేదికగా తన పదవికి రాజీనామా చేశారు. రమేష్ శివసేన అనుబంధ సంస్థ యువసేనకు నాయకుడిగా ఉన్నారు. ‘బరువైన హృదయంతో నా జీవితంలో చాలా కష్టమైన నిర్ణయం తీసుకుంటున్నాను’ అని రాశారు. శివసేనకు చెందిన ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి ‘నా అంతరాత్మ, ఐడియాలజీ అంగీకరించడం లేదు’ అన్నారు. ‘సగం మనసుతో పనిచేయలేను… నా పదవికి ఇది మంచిది కూడా కాదు’అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 21 ఏళ్లుగా శివసేనలో ఉంటున్న రమేష్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ సైట్ ను నిషేధించాలని పోరాడుతూ బాగా పాపులర్ అయ్యారు. బాలాసాహెబ్ శివసైనికుల హృదయాల్లో తాను ఎప్పటికీ ఉంటానన్నారు.